అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్ ‘క్యాండిడా ఆరిస్’ అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. దవాఖానాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నదని, శక్తివంతమైన యాంటీఫంగల్ ఔషధాల్ని సైతం వైరస్ తట్టుకుంటున్నదని వైద్యులు తెలిపారు. ఈ వైరస్‌ను మొదటిసారి 15ఏండ్ల క్రితం జపాన్‌లో గుర్తించారు. తాజాగా అమెరికా సహా 40 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని WHO ఆందోళన వ్యక్తం చేసింది.