జర్మనీకి చెందిన రవాణా సంస్థ ఫ్లిక్స్‌బస్ భారత్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా, ఫ్లిక్స్‌బస్ న్యూఢిల్లీ, హిమాచల్, జమ్మూ మరియు కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, యూపీ అంతటా ప్రధాన నగరాలు మరియు మార్గాలను కలుపుతూ సర్వీసులను నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. లాంచింగ్ ఆఫర్ కింద, ప్రారంభ రూట్‌లు ఎక్కడి నుండి ఎక్కడికైనా రూ. 99కి టిక్కెట్లు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.