E-PAPER

ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు..

ఏపీలో కాంగ్రెస్‌‌కు పూర్వవైభవాన్ని కల్పించే దిశగా పీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కసరత్తు సాగిస్తోన్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తోన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్‌కు ఊపిరి పోసే ప్రయత్నాల్లో ఉన్నారు.

 

ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు షర్మిల. శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఒంగోలు, తిరుపతిలో సభలను నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ నాయకులో సమావేశం అయ్యారు. ఇటీవలే అనంతపురంలో పర్యటించారు.

 

 

ప్స్తుతం తన జిల్లా వ్యాప్త పర్యటనలకు విరామం ప్రకటించారు. పార్టీ కమిటీలపై దృష్టి సారించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయడానికి అవసరమైన కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు వైఎస్ షర్మిల. ఇప్పటికే వివిధ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుందని సూచించారు.

 

ఎన్నికల సమీపిస్తోన్న నేపథ్యంలో- పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఇందులో భాగంగా 15 మంది అధికార ప్రతినిధులను ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ఉమ్మడి జిల్లాల నాయకులకు ఇందులో ప్రాధాన్యతను కల్పించారు.

 

ఈ 15 మంది అధికార ప్రతినిధుల్లో- చింతాడ దిలీప్- శ్రీకాకుళం, మువ్వల శ్రీనివాసరావు- విజయనగరం, గూణూరు వెంకట్రావ్- విశాఖపట్నం, పార్వతి శివ గణేష్- తూర్పు గోదావరి, సోడదాసి గంగయ్య- పశ్చిమ గోదావరి, రాణిమేకల సతీష్- కృష్ణా, దబ్బుగొట్టు రామకృష్ణ- గుంటూరు ఉన్నారు.

 

శ్రీపతి సతీష్- ప్రకాశం, సురేష్ బాబు- నెల్లూరు, పీ రామ్ భూపాల్ రెడ్డి- అనంతపురం, ఎన్‌డీ విజయజ్యోతి- కడప, ఊకోటు శ్రీనివాసులు (వాసు)- కర్నూలు, ఎం గోవర్ధన్ రెడ్డి- చిత్తూరు, తాడికొండ వెంకటేశ్వరరావు- బాపట్ల, ఏబీఎన్ వర్మ- విశాఖపట్నం.. అధికార ప్రతినిధులుగా అపాయింట్ అయ్యారు.

Facebook
WhatsApp
Twitter
Telegram