తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. తొలిరోజు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ హామీల అమలు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది.