మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ రెచ్చిపోయారు. ఆయన ప్రవర్తన శ్రుతిమించింది. మంచిర్యాల మీటింగ్‌లో బాల్క సుమన్ లో ఆవేశంతో ఊగిపోయారు. అసభ్య పదజాలంతో దూషించారు. చెప్పు చూపిస్తూ ప్రసంగించారు. దూషణ పర్వానికి దిగారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎంను ఇష్టానుసారం దూపించారు. అసభ్య పదజాలం ప్రయోగించారు. ఆ తర్వాత కాసేపటికి సర్ది చెప్పుకునే యత్నం చేశారు. బాల్క సుమన్ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.