E - PAPER

E-PAPER

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎండి. ఇబ్రహీం

రంగారెడ్డి జిల్లా ప్రతినిథి : బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నేత ఎండి. ఇబ్రహీం హెచ్చరించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెప్పులతోని కొట్టినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే గులాబీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఫ్రస్టేషన్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే నేతలను తన్ని తరిమేసే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చిల్లర గాళ్లా గతంలో తెలంగాణను పాలించిందని ప్రశ్నించారు. ఈ చిల్లరగాళ్ల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అండ్ టీం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. రెచ్చగొట్టే మాటల ద్వారా తమను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అవినీతిని మొత్తం బయటికు తీస్తామని హెచ్చరించారు. గులాబీ నేతలు విద్వేషం, విషం చిమ్మే పనులు చేస్తున్నారని.. వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ బలుపుతోనే బీఆర్ఎస్‌ను ఎన్నికల్లో ఓడించారని .. ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి. ఇబ్రహీం హెచ్చరించారు..

Facebook
WhatsApp
Twitter
Telegram