దుల్కర్ సల్మాన్ సరికొత్త కథతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. మీనాక్షి చౌదరి కథానాయిక. అట్లూరి వెంకీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న వ్యక్తిలా సరికొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.