‘రామాయణ్’ సీరియల్ మరోసారి అలరించేందుకు వస్తోంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ‘రామాయణ్’ త్వరలోనే దూరదర్శన్‌లో ప్రసారం కానుంది. ఈ సీరియల్ రీ టెలికాస్ట్ అవడం ఇది రెండోసారి. 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30గంటలకు దూరదర్శన్‌లో ప్రసారమైంది. ఆ తర్వాత కోవిడ్ సమయంలో దీన్ని రీ టెలికాస్ట్ చేశారు. పలు రికార్డులు సాధించిన ఈ సీరియల్ మరోసారి ఏ రికార్డును సొంతం చేసుకుంటుందో వేచిచూడాలి.