తెలంగాణలో ఇవాళ్టితో గ్రామ సర్పంచ్ ల పదవీ కాలం ముగియనుంది. దీంతో పాలనను స్పెషల్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు తమనే పదవిలో కొనసాగించాలని సర్పంచుల సంఘం కోరింది. లేదంటే పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగించాలని సర్పంచులు కోరుతున్నారు. అయితే పొడిగింపుపై సర్కార్ స్పందించలేదు. ఇక రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది.