E-PAPER

చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో డ్యాన్స్ ఇరగదీసిన సాయి పల్లవి..!

హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. సాయి పల్లవి సోదరి నటి పూజా కన్నన్ పెళ్లి చేసుకోబోతుంది. తన ప్రియుడు వినీత్‌ని పూజా వివాహమాడనుంది. వినీత్, పూజా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా తాజాగా నిశ్చితార్థం కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో సాయి పల్లవి డాన్స్ ఇరగదీసింది.

 

సాధారణంగా సాయి పల్లవి సినిమా చేస్తుందంటే.. అందులో ఆమె డాన్స్ కోసం చాలా మంది వెళ్తుంటారు. అలాంటిది చాలా కాలం తర్వాత ఆమె ప్రైవేట్ ఫంక్షన్‌లో డాన్స్ చేసిన వీడియోను చూసి అభిమానులు, ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సాయి పల్లవి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. చీరకట్టులో మెరిసిపోయిన సాయిపల్లవి.. అదిరిపోయే బీట్‌కు తన సోదరి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి స్టెప్పులేసి ఔరా అనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది

Facebook
WhatsApp
Twitter
Telegram