E-PAPER

మయన్మార్ సైనికులను తిరిగి పంపిన భారత ఆర్మీ..

మయన్మార్ నుంచి భారత్‌కు 276 మంది సైనికులు వచ్చారు. వీరిలో 184 మందిని భారత ఆర్మీ తిరిగి తమ దేశానికి పంపించింది. విమానాల్లో తిరిగి సిట్వే (అక్యాబ్)కి తరలించారు. మయన్మార్ దళాలు బయలుదేరే ముందు భారత అధికారులు అవసరమైన అన్ని లాంఛనాలను పూర్తి చేశారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించారు. కాగా, మయన్మార్ సైనికులు గత వారం జాతి తిరుగుబాటు బృందంతో కాల్పులు జరిపిన తర్వాత మిజోరాంకు వచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram