E-PAPER

రోజాకు టికెట్ ఇవ్వొద్దంటున్న నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు..

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సొంత నియోజకవర్గంలోనే మంత్రి రోజాకు వ్యతిరేకత ఎక్కువవుతోంది. నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు ఆమెపై అసమ్మతి స్వరం వినిపించారు. తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. భవనాలు ఉన్నా తమకు కార్యాలయాలను కేటాయించడం లేదని విమర్శించారు. ఇదే విషయంపై చిత్తూరు జడ్పీటీసీ సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్ ను నిలదీశారు. అభివృద్ధి కార్యక్రమాలను కూడా రోజా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రోజాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని ముఖ్యమంత్రి జగన్ ను డిమాండ్ చేశారు.

 

మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రోజా రూ. 70 లక్షలు డిమాండ్ చేశారని పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డికి మూడు విడతల్లో రూ. 40 లక్షలు ఇచ్చానని… చైర్మన్ పదవి ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని ఆమె వాపోయారు. దళిత మహిళనైన తనకు ముఖ్యమంత్రి న్యాయం చేయాలని కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram