విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని కూర్మనపాలెం గేట్ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్ష సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉంది. తాజాగా స్పీకర్ రాజీనామాను ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.