E-PAPER

ఆర్జీవీ ‘వ్యూహం’ రిలీజ్ మరోసారి వాయిదా..

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి బ్రేక్ పడింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిలుపుదలను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. పైగా మరో మూడు వారాలు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మూడు వారాల్లోగా మళ్లీ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఈ సినిమా తీశారని, సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేశ్ ఈ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

Facebook
WhatsApp
Twitter
Telegram