E-PAPER

బాల రాముడి ప్రాణ ప్రతిష్ట.. దీక్ష విరమించిన నరేంద్ర మోడీ..

సోమవారం అయోధ్యలోని రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం ఆయన అక్కడ విశేషమైన పూజలు నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన క్రతువులో ఆయన పాల్గొన్నారు. పూజ సందర్భంగా కూడా ఆయన ఎటువంటి ఆహారం తీసుకోలేదు. అయునప్పటికీ ఎంతో నిష్టతో పూజా కార్యక్రమంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాల రాముడికి హారతి ఇచ్చారు. పూజా క్రతువు ముగిసిన అనంతరం పండితులు గోవింద్ దేవ గిరిజీ మహారాజ్ ఆయనకు తీర్థం అందించి దీక్ష విరమించారు.. ఈ దీక్షను అనుష్టాన దీక్షగా పిలుస్తారు. మోడీ ఎప్పుడైతే ఈ దీక్ష పాటించడం మొదలుపెట్టారు చాలామంది కూడా ఆయననే అనుసరించారు. సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ టాపిక్ అయిందంటే మామూలు విషయం కాదు.

 

మోడీ ఇప్పుడు మాత్రమే కాదు దుర్గా నవరాత్రుల సందర్భంగా కూడా దీక్ష పాటిస్తారు. కటిక నేల మీద పడుకోవడం.. సూర్యోదయానికి ముందే లేవడం.. చల్లటి నీళ్లతో స్నానం చేయడం.. కేవలం నిమ్మరసం మాత్రమే తాగటం.. దుర్గాదేవి ఉపాసనలో ఉండటం.. నవరాత్రుల ముగింపు రోజు దుర్గాదేవికి విశేషమైన పూజ చేయడం అనేవి మోడీ పాటిస్తారు. ఆ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా శ్వేత దేశం వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇదేవిధంగా పాటించారు. చివరికి అక్కడ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram