కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా తేలుకోనేలేదు! ఇంతలోనే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్‌పై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాని మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. SARS-Cov2కు చెందిన సబ్ వేరియంట్ GX_p2V అనే ఉపకరణంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారని అధ్యయనాలు పేర్కొన్నాయి.