E-PAPER

ఇక విదేశాల్లోనూ గూగుల్ పే..

గూగుల్ పే ఉపయోగించేవారికి ఓ శుభవార్త. ఇకపై గూగుల్ పేతో విదేశాల్లోనూ యుపిఐ చెల్లింపులు చేయొచ్చు. దీనికోసమే గూగుల్ పే ఇండియా(Google India Digital Services Out Ltd.) బుధవారం ఇంటర్‌నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) సహకరించే విధంగా నేషనల్ పేమెంట్ కార్పెరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విదేశాల్లో యుపిఐ సేవలను విస్తరిస్తుంది.

 

ఈ కొత్త విదేశీ యుపిఐ సర్వీస్ వల్ల విదేశాలకు రాకపోకలు జరిపే భారతీయులు ఇకపై ఇంటర్నేషనల్ గేట్‌వే అనుమతి లేకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. అలాగే విదేశీ వ్యాపారులు ఈ ఇంటర్నేషనల్ యుపిఐతో నేరుగా భారతీయ కస్టమర్ల నుంచి చెల్లింపులు పొందవచ్చు. ఇప్పటి వరకు విదేశాలకే చెల్లింపులు చేసేందుకు ఆ దేశ కరెన్సీ, క్రెడిట్ కార్డు లేదా విదేశీ కరెన్సీ కార్డుని ఉపయోగించేవారు.

 

ఇకపై విదేశీ వ్యాపారుల వద్ద కూడా గూగుల్ పే యుపిఐ సౌకర్యం ఉంటుంది. భవిష్యత్తులో మిగతా ఇండియన్ యుపిఐలు కూడా ఈ సేవలు పొందే అవకాశం ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram