ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. మరో కీలక నేత ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. బొప్పనతోపాటు ఆయన అనుచరులు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు.
బొప్పన భవకుమార్ ఇప్పటికే విజయవాడలోని టీడీపీ కీలక నేతలతో చర్చలు జరిపారు. వంగవీటి రాధా, కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ను కలిసి చర్చించారు. మరోవైపు బొప్పనను బుజ్జగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసింది. దేవినేని అవినాష్, మరికొందరు వైసీపీ నేతలు రంగంలోకి దిగి చర్చించారు. అయితే వైసీపీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని బొప్పన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు.
బొప్పన భవకుమార్ ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీ చేరతారని తెలుస్తోంది. 2019లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బొప్పన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు.









