E-PAPER

తన ఫేవరెట్ హీరో ను టార్గెట్ చేసిన సందీప్…ఆయనతో సినిమా ఎప్పుడంటే..?

అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాతో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఆ సినిమాతో ఒక కొత్తరకం మేకింగ్ కి శ్రీకారం చుట్టాడమే కాకుండా అప్పటిదాకా ఉన్న మూస దోరణి కి స్వస్తి చెప్పాడు. ఇక తెలుగు లో ఈయన చేసిన అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేశాడు.ఈ సినిమా కూడా అక్కడ సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా 360 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టి బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ పేరు మారు మ్రోగేలా చేసింది.

 

More

From Entertainment

ఇక ఈ సినిమా తర్వాత రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి అనిమల్ సినిమాను తీశాడు ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకొని దాదాపు 900 కోట్ల వరకు కలక్షన్లను రాబట్టి ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 5 సినిమాల్లో ఒకటి గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇది ఇక ఉంటే సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా మహబూబాబాద్ లోని దంతాలపల్లి కి వెళ్లి నియర్ అండ్ డియర్స్ ని కలిసిన వేళ తన మనసులోని మాటని బయట పెట్టాడు.

 

ఆయన అభిమాన హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి అలాగే తన కొడుకు అయిన రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఉంది అని తన మనసులోని మాటని అయితే బయట పెట్టాడు. నిజానికి సందీప్ రెడ్డివంగా కి చిరంజీవి పవన్ కళ్యాణ్ లు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వాళ్ల సినిమాలు చూసుకుంటూనే పెరిగాడు. అందువల్లే ఆయనకి వాళ్ళంటే విపరీతమైన ఇష్టంతో పాటు వాళ్ళతో సినిమాలు చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఇక సాలిడ్ హిట్ సినిమా తీయాలని ఉందని ఈ రకంగా తన మనసులోని మాట బయట పెట్టాడు.

 

ఇక దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది… ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ సినిమా ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.ఇక ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక రెండు సినిమాల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ఉండొచ్చని ఇప్పటికే మెగా అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు…ఇక వీళ్ల కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి…

Facebook
WhatsApp
Twitter
Telegram