E-PAPER

ఆటో డ్రైవర్లకు రూ. 15 వేల భృతి ఇవ్వాలంటూ హరీశ్ రావు డిమాండ్..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డన పడేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినా.. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం అంతే ముఖ్యమని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాలతో ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.

 

అంతేగాక, ఆటో డ్రైవర్లకు ప్రతి నెల రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికులు కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలన్నారు.

 

Harish Rao demands Telangana govt for solve auto drivers issues

ప్రభుత్వం ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని హరీశ్ రావు హితవు పలికారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినప్పటికీ.. బస్సులు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలన్నారు.

 

ఆటో కార్మికులకు నెలకు 15వేల జీవన భృతి కల్పించాలని, లేదంటే వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆటోవాలలా జీవితంలో పండుగ వాతావరణం కనుమరుగైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారని.. కానీ వచ్చిన వారం రోజులకే ఇలా రోడ్డున పడతామని అనుకోలేదంటున్నారని చెప్పారు. మరోవైపు, మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు పెంచాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram