E-PAPER

ఫరూక్ అబ్దుల్లా నోట.. రాముడి మాట..అయోధ్య మందిరంపై సంచలన కామెంట్స్..

రాముడు కేవలం హిందువులకే కాదు.. ప్రపంచం మొత్తానికి చెందినవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరినీ ఆయన అభినందించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభానికి సిద్ధమైందని, దీని నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు చెబుతున్నానన్నారు.

 

రామ మందిర ఆలయ ప్రారంభోత్సవ వేళ ఫరూఖ్‌ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసేవే అనుకోవాలి. అంతేకాదు రాముడిని ఆయన పొగడ్తలతో ముంచేశారు. సోదరభావం, ప్రేమ, ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకునే సందేశాన్ని శ్రీరాముడు ఇచ్చారని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. అదే సమయంలో మన దేశంలో రోజురోజుకు తగ్గిపోతున్న సోదరభావాన్ని పెంచాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు ఫరూక్‌.

Facebook
WhatsApp
Twitter
Telegram