E-PAPER

తమిళిసై రాజకీయాల్లో వస్తున్నారా? తెలంగాణ గవర్నర్ క్లారిటీ….

తాను రాజకీయాల్లోకి వెళ్లి .. ఎన్నికల్లో పాల్గొంటానంటూనని వస్తున్న వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. అవన్నీ ప్రచారాలేనని ఆమె స్పష్టత ఇచ్చారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోను గవర్నర్ సందర్శించారు. తాను పోటీ చేస్తానని అధిష్టానాన్ని కలిశానని జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమేనని అలాంటి పుకార్లు నమ్మవద్దన్నారు.

 

తాను పోటీ చేయడం కోసం డిల్లీకి వెళ్లటం కానీ.. అక్కడ పార్టీ పెద్దలను కలవడం కానీ చేయనని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నానన్న తమిళిసై.. బాధ్యతలను నిర్వర్తించడానికి 24 గంటలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తన భవిష్యత్ ప్రధాని మోడీ, రాముని ఆశిసులతో సాగుతుందన్న గవర్నర్‌ అన్నారు. అయోధ్య రామమందిర ద్వారాలను రూపొందించే అవకాశం..అనురాధ టింబర్ డిపోకు లభించడం తెలంగాణకే గర్వకారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు

Facebook
WhatsApp
Twitter
Telegram