సీఎం రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని కలిశారు. శనివారం హైదరాబాద్ లో నళిని మార్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిసి మాట్లాడారు. నళిని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉద్యోమంలో కీలకంగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నళినికి పోస్టింగ్ ఇవ్వలేదు.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగాన నళినికి పోలీస్ శాఖలో తిరిగి అదే ఉద్యోగాన్ని ఇవ్వాలని సీఎం రేవంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నళినికి ఉద్యోగం చేయాలని ఉంటే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం కల్పించాలని సీఎస్ ను ఆదేశించారు.
అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. రేవంత్ ప్రతిపాదనపై నళిని సోషల్ మీడియా ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. “ముఖ్యమంత్రి గారు!! మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది” అనిపేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నళిని తిరిగి ఉద్యోగంలో చేరుతారా లేక మర్యాదపూర్వకంగా కలిశారో తెలియరాలేదు