తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు చేసేందుకు రాయితీ ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో వాహనదారులు జరిమానా చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనాల పెండింగ్ చలాన్లపై ఆఫర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున చలాన్ల క్లియరెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 30 (శనివారం) వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33.81 లక్షల పెండింగ్ చలాన్లకు సంబంధించి జరిమానా చెల్లించారు.
వీటి ద్వారా రూ. 29.45 కోట్లు వసూలు అయినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో శనివారం వరకు 11.17 లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. వాిటి ద్వారా జరిమానా రూ. 7.7 కోట్ల వసూలు అయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3.5 లక్షల పెండింగ్ చలాన్లకు సంబంధించి డబ్బులు చెల్లించారు. ఈ చలాన్ల ద్వారా రూ. 2.86 కోట్లు వచ్చాయి.
Rs.29 crores have been received after the announcement of concession on traffic pending challans
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6.23 లక్షల పెండింగ్ చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఈ చలాన్ల ద్వారా రూ. 6.31 కోట్ల వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే డిసెంబర్ 25 తేదీలోపు పెండింగ్ ఉన్న చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ చలాన్లు పడితే ఫుల్ అమౌంట్ పే చేయాలని స్పష్టం చేశారు.
గతంలో కూడా ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. అప్పుడు రూ.300 కోట్లు వసూలయ్యాయి. అయితే గతం కంటే ఇప్పుడు ఎక్కువగా రాయితీ ప్రకటించింది. టూవీలర్స్,త్రీ వీలర్స్ పై 80 శాతం, టీఎస్ ఆర్టీసీ బస్సులపై 90 శాతం, 60 శాతం లైట్ వెయిట్ లేదా హెవీ వెయిట్ మోటార్ వెహికల్స్, కార్లపై 60 శాతం రాయితీ ప్రకటించారు.