జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్ర కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ యాత్ర రూట్ మ్యాప్, లోగోను ఖరారు చేసేందుకు యాత్ర కొనసాగే 14 రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో జనవరి 4న సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అదే రోజు యాత్ర లోగో, 8న రూట్ మ్యాప్, 12న థీమ్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు.