కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ స్పందించలేదన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. శుక్రవారం మధ్యాహ్నం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు.
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతం నుంచి తాము చెబుతూ వచ్చిన విషయాలే నిజమయ్యాయని, త్వరలో ఇందులో అవకతవకలపై న్యాయ విచారణ చేపడతామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాజకీయ మతలబులతో ప్రాజెక్టుతో ఆదాయం ఎక్కువ చూపారని, కానీ రూపాయికి 52 పైసలు మాత్రమే ప్రయోజనం కలిగేలా ఉందని మంత్రులు పేర్కొన్నారు.
కాళేశ్వరం కింద ఎకరాకు నీరు ఇచ్చేందుకు రూ.46 వేలు ఖర్చు అవుతోందని, రైతులకు ఆదాయం సాగు మాత్రమేనని మంత్రులు అన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 90 శాతం ఎత్తిపోతలకే పోతోందన్నారు. ఆనకట్టల్లో నీటి నిల్వ భారం ఎక్కువ కావడం వల్ల దెబ్బతిన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలపై ఊహించనంత భారం పడబోతోందన్నారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో రాజకీయ, ఇతర కోణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
ఎన్నికల ముందు అప్పటి అధికార పార్టీకి అధికారులు అనుకూలంగా ప్రకటన ఇచ్చారని, తాము లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ఈఎన్సీ లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. ప్రాణహిత పూర్తి అయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే గత బీఆర్ఎస్ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విషయంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గత ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మేడిగడ్డ బ్యారేజీని ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందం సందర్శించింది.
మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్కూలిన ప్రాంతాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, ఇతర విషయాలపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. ప్రాణహిత పూర్తి అయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే గత బీఆర్ఎస్ప్రభుత్వం కాళేశ్వరం చేపట్టిందని ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. తమ్మిడి హట్టి వద్ద 3వేల ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లు వచ్చేవని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ఇంజినీర్ల సలహాలు తీసుకున్నారా? ఆయనే చీఫ్ఇంజినీర్‍గా చేశారా? అని మంత్రులు ప్రశ్నించారు. కేసీఆర్చర్యలు చూసి ఇంజినీర్లు అప్పుడే సెలవు పెట్టి పోవాల్సిందన్నారు. కొండ పోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుందని, కేసీఆర్ఫామ్‌హౌస్‌కు తప్ప ఇతర పొలాలకు నీరు పోదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టుపై ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీరు వెళ్తోందని ప్రశ్నించారు. ఇంజినీర్లుచెప్పింది వినలేదు, ఇప్పుడు జరిగిన ఈ నష్టాన్ని ఎవరు భరించాలని మంత్రి ధ్వజమెత్తారు.
మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ఆరోపించారు. కాళేశ్వరం కోసం ఎంత విద్యుత్వాడారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రయోజనం లేకుండా పెట్టిన పెట్టుబడితో, కేసీఆర్ మానస పుత్రిక పరిస్థితి ఇప్పుడు ఏంటని గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్కూలినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు కూలిందో స్పష్టంగా చెప్పలేకపోయిందని విమర్శించారు. రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్తెలిపారు.
కేసీఆర్మార్కు ఉండాలనే తాపత్రయం తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. డయా ఫ్రాం వాల్ఆర్సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా అని ప్రశ్నించారు. సీకెండ్ఫైల్ఫెయిల్ అయినందుకే రోజురోజుకు కుంగిపోయిందని చెప్పారు. ప్రొటెక్షన్పనులు ఒక్క వరదకే పోతే పనులు ఎంత నాసిరకంగా చేశారో అర్థమవుతోందన్నారు. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈ పై అధికారులకు లేఖ రాశారన్నారు. ఈ లేఖలపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్, అధికారులు కలిసి చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. నిర్మాణంలో చూపిన అత్యుత్సాహం నిర్వహణలో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. ఈ అన్ని అంశాలపై విచారణ జరిపి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు.