తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 2వ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇవాళ జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అభయహస్తం దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.