E-PAPER

తెలంగాణలో ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజు 7,46,414 అర్జీలు..

తెలంగాణలో ప్రజాపాలన ఫస్ట్ డే సూపర్ హిట్ అయింది. మొదటి రోజు ప్రజల నుంచి అనూహ్యాస్పందన వచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా 7లక్షల 46వేల 414 అర్జీలు వచ్చాయని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ సహా.. పట్టణాల నుంచే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. పట్టణాల నుంచి 4లక్షల 57వేల 703 దరఖాస్తులు రాగా.. గ్రామాల నుంచి 2 లక్షల 88వేల 711 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు.

 

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తొలి రోజు పూర్తైన తర్వాత సీఎస్ శాంతి కుమారి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ జిల్లా కేంద్రంలోనూ సరిపడేలా ఆరు గ్యారెంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని కలెక్టర్లకు సూచించారు. అభయహస్తం ఫామ్లు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

ఈ గ్రామ సభలకు హాజరయ్యే వారికి మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతీ వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని.. ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని చెప్పారు. ఇక.. ఫారాలను నింపడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సీఎస్ జిల్లా అధికారులకు ఆదేశారు జారీ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram