రాష్ట్ర మంత్రుల బృందం ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లను సందర్శించనుంది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు చేరుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈఎన్‌సీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల డ్యామేజీపై సమీక్ష నిర్వహిస్తారు