కాంగ్రెస్‌ది గడీల పాలన కాదని.. గల్లీ ప్రజల పాలన అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామం జామినిలో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అభయహస్తం గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ తనను మేడం అని కాకుండా.. సీతక్కగానే పిలవాలని కోరారు. సీతక్క అన్న పిలుపులోనే ఆప్యాయత ఉంటుందన్నారు.