కేరళలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల బుధవారం రాత్రి మండల పూజ తర్వాత తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే. మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా తిరిగి శనివారం (డిసెంబర్ 30న) ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియ, 15న మకరవిలక్కు వేడుకల జరుపనున్నట్లు ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది.