కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ‘జై భారత్ నేషనల్’ పేరుతో ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అన్ని వర్గాల ప్రజలను కలిసిన తర్వాతే పార్టీ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాజకీయ పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే.. ప్రజల్లో అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా అర్ధరాత్రి ఆలోచన చేద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చలు జరిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేశారు. కాగా 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.