వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థినులపై చర్యలు తీసుకున్నారు. జూనియర్ యువతులను ర్యాగింగ్ చేసిన 81 మంది విద్యార్థినులను వర్శిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ 81 మంది యువతులు కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందిన వారు. భారీ సంఖ్యలో సస్పెన్షన్ వేటు పడటం యూనివర్శిటీలో హాట్ టాపిక్‌గా మారింది.