ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా గాజలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి. ఈ యుద్దంలో గాజాలోని అమాయక ప్రజలు బలి అవుతున్నారు. అక్టోబర్ 7న మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో చర్చలు జరిగినా యుద్ధం ముగింపు పై స్పష్టత రాలేదు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 20,057 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది అనితెలిపింది.