E-PAPER

ఢిల్లీ ముఖ్యమంత్రికి మూడోసారి ఈడీ సమన్లు..

ఢిల్లి లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మూడోసారి సమన్లు జారీ చేసింది. 2024 జనవరి 3న ఈడి ముందు విచారణకు హాజరుకావాలని తెలిపింది. కాగా, ఇప్పటికే ఈడీ ఆయనకు రెండుసార్లు సమన్లు పంపినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు. జనవరి 3న కూడా ఆయన ఈడీ ముందు హాజరుకాకుంటే ఆయనపై నాన్‌- బెయిలబుల్ వారెంట్లు జారీ చేసే అవకాశాలున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram