సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘ప్రజాపాలన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా విని.. అక్కడికక్కడ పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.