E-PAPER

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్.. హాజరైన తెలంగాణ గవర్నర్‌, సీఎం.

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. హోంకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు, మాజీ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు.

 

శీతాకాలం విడిది కోసం హైదరాబాద్​ వచ్చిన రాష్ట్రపతి నేతలకు తేనీటి విందు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి కూడా విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి తదితరులు రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి ఒక్కరిని కలిశారు. అందరు కలసి కాసేపు మాట్లాడారు. అనంతరం ఫొటోలు దిగారు.హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. హోంకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు, మాజీ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు.

 

శీతాకాలం విడిది కోసం హైదరాబాద్​ వచ్చిన రాష్ట్రపతి నేతలకు తేనీటి విందు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి కూడా విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి తదితరులు రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి ఒక్కరిని కలిశారు. అందరు కలసి కాసేపు మాట్లాడారు. అనంతరం ఫొటోలు దిగారు.

Facebook
WhatsApp
Twitter
Telegram