కరోనావైరస్‌కు సంబంధించిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ సమస్యలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ట్రావెల్ నిబంధనలను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ మాస్క్‌ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు తప్పకుండా మాస్క్ ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. సింగపూర్‌తో పాటు ఇండోనేసియా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.