తెలంగాణలో పలువురు ఐఏఎస్ ల బదిలీ జరిగింది. ట్రాన్స్కో, జెన్ కో, సహా వివిధ శాఖలకు పలువురు అధికారులను బదిలీ చేసింది. యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి బాధ్యతలు దక్కాయి. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఆమెను నియమించింది. డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, వ్యవసాయ కార్యదర్శిగా బి.గోపి,టిఎస్ఎస్పిడిసిఎల్ చైర్మన్ గా ముషారఫ్ అలీ ఫరూకీని, ట్రాన్స్ కో జేఎండీ గా సందీప్ కుమార్, టిఎస్ఎన్పిడిసిఎల్ వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్నాటి వరుణ్ రెడ్డి, ఎంపీడీసీఎల్ కు సీఎండీగా క్రాంతి వరుణ్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ కమిషనర్ గా శైలజా రామయ్యర్ ను నియమించారు.
విద్యుత్ డిపార్ట్ మెంట్లోనే ఈ బదిలీలు ఎక్కువగా జరిగాయి. ఇందన శాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమిస్తూ ట్రాన్స్ కో చైర్మన్ అండ్ ఎండీగ అదనపు బాధ్యతలూ అప్పజెప్పారు. ఇటీవల డీ. ప్రభాకర్ రాజీనామా చేసిన నేపత్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.