మాస్ మహారాజ రవితేజ హీరోగా, డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా రాబోతుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో షాక్, మిరపకాయ్ వంతో హిట్ సినిమాలు వచ్చాయి. కాగా, తాజాగా మూడో సినిమాకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.