భారత్ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. భూకబ్జా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్నారు. ఈ నేపథ్యంలో- పోలీసులు కేెసులు నమెదు చేశారు.
ఎన్నికల సమయంలో రాత్రిక రాత్రే మల్లా రెడ్డి తన భూములను కబ్జా చేశారంటూ షామీర్‌పేట్ మండలం కేశవరం గ్రామానికి చెందిన కేతావత్ బిక్షపతి అనే వ్యక్తి ఆరోపించారు. షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేశవాపూర్‌లో సర్వే నంబర్లు 33, 34, 35ల్లో తనకు 47 ఎకరాల 18 గుంటల భూమి ఉందని, తనకు వారసత్వంగా అందిందని వివరించారు.
Police files case against former minister Malla Reddy
దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు తన వద్దే ఉన్నాయని బిక్షపతి పోలీసులకు చెప్పారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి వాటిని మల్లారెడ్డి తన పేరు మీద బదలాయించుకున్నారని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని బాధితుడు తన ఫిర్యాదు పత్రంలో పొందుపరిచారు. ఆయనకు స్థానిక ఎమ్మార్వో సహకరించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనితో మల్లారెడ్డితో పాటు ఎమ్మార్వోపైనా కేసు పెట్టారు పోలీసులు.
దీనిపై విచారణ జరిపించిన పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన సమీప బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 420 కేసు నమోదు చేశారు.’