E-PAPER

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా అవినాష్‌ మహంతి..

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా అవినాష్‌ మహంతి బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన సంస్థలు ఉన్నాయని సీపీ అవినాష్ మహంతి అన్నారు.

 

ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజలకు సేవ చేస్తామని పేర్కొన్నాకరు. చట్టబద్ధంగా పని చేస్తామని సీపీ స్పష్టం చేశారు.సైబర్ క్రైమ్ అతి పెద్ద సమస్య అని.. దానిపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. ఎలాంటి కేసులైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

 

సైబరాబాద్‌ అడ్మిన్ విభాగానికి జాయింట్ కమిషనర్‌గా ఉన్న అవినాష్ మహంతిని.. తెలంగాణ సర్కార్ నిన్న సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా నియమించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram