2024 సంక్రాంతి కి పోటీ మామూలుగా లేదు.. వరుసగా పోటీకి దిగుతున్న క్రేజీ మూవీస్ లో హనుమాన్ కూడా ఒకటి. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తేజ సజ్జ.. హీరోగా నటిస్తున్న ఈ మూవీ మొదటి అసలు సిసలైన ఇండియన్ సూపర్ హీరో మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ మూవీ కూడా ఒక భాగం అని టాక్.
మూవీ నుంచి విడుదలైన టీజర్ బాగా వైరల్ కావడంతో చిత్రంపై క్రేజీ బజ్ నెలకొని ఉంది. చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి.. దీంతో ప్రస్తుతం ఈ చిత్రం సంక్రాంతి పోటీకి సై అనేట్టుగా ఉంది. సంక్రాంతి బరిలో గుంటూరు కారం తన స్థానాన్ని ఫిక్స్ చేసుకుంది. ఆ మూవీని టచ్ చేసి ఆస్కారం అయితే లేదు కానీ మిగిలిన సినిమాలకు హనుమాన్ గట్టి పోటీ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది.
అలాగే మూవీలో మంచి గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయని టాక్. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ డిసెంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ అంటే మామూలుగా చేస్తే ఎలా.. అందుకే ఒక ప్రత్యేకమైన పోస్టర్ని డిజైన్ చేసి మరీ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ మూవీపై అంచనాలను వేరే రేంజ్ కి తీసుకెళ్లే విధంగా ఉంది. ఒక్క పోస్టర్ తోటే సాలిడ్ కంటెంట్ మూవీ అని స్ట్రాంగ్ గా చెప్తున్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.
హనుమాన్ మూవీ టైటిల్ కి తగ్గట్టుగానే ఈ మూవీ హనుమంతుడి బ్యాక్ డ్రాప్ ఏదో ఉంది అన్నట్లు ఇండికేట్ చేస్తూ.. పోస్టర్లో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న హీరోని హైలైట్ చేశారు. ఇక హీరో వెనుక భారీ హనుమంతుడి విగ్రహం ఉంది. అంజనాద్రి ఫాంటసీ ప్రపంచంలోకి.. ఈ చిత్రం అందర్నీ ఆసక్తిగా ఆహ్వానిస్తోంది. మూవీ ట్రైలర్ బాగా ఆకట్టుకునే విధంగా ఉంది అని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ హిట్టయితే మూవీ పై అంచనాలు మరింత పెరుగుతాయి. ఈ చిత్రం జనవరి 12, 2024న తెలుగుతో పాటుగా..హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషలలో విడుదల అంటే ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ దాటి పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదలకు రెడీగా ఉంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.