తెలంగాణలో జెన్ కో ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ నెల 17న జరగాల్సిన ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అదేరోజు ఇతర పోటీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జెన్ కో పరీక్షలను
వాయిదా వేశామని తెలంగాణ జెన్ కో ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తోంది. జెన్ కో ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు పరీక్షలను వాయిదా వేయాలని ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 17న ఇతర పరీక్షలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
జెన్ కో పరీక్షలను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబును అభ్యర్థులు కోరారు. వారి అభ్యర్థనను శ్రీధర్ బాబు.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తూ తెలంగాణ జెన్ కో నిర్ణయం తీసుకుంది.