హైదరాబాద్ నగరంలోనే ఆహార పదార్థాల కల్తీ అధికంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదికలో వెల్లడించింది. ఆహార కల్తీలో హైదరాబాద్ సిటీ దేశంలోనే టాప్ లో నిలిచింది. 2022లో దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా, అందులో 246 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. దేశంలోని 19 నగరాల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌లోనే నమోదు కావడం గమనార్హం