టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత సినీ నిర్మాణ సంస్థను ప్రారంబించారు. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేసినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. తనకు ఎంతో ఇష్టమైన ఇంగ్లీష్ పాప్ సాంగ్ ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్’ స్ఫూర్తితో తన ప్రొడక్షన్ హౌస్ కి ఈ పేరు పెట్టినట్టు ఆమె వెల్లడించారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా కొత్త తరం ఆలోచలను, కంటెంట్ ను ప్రోత్సహిస్తానని సమంత పేర్కొన్నారు.