E-PAPER

విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్..

విద్యార్థులకు కెనడా ప్రభుత్వ షాకిచ్చింది. తాజాగా అక్కడి ప్రభుత్వం స్టూడెంట్‌ పర్మిట్‌ డిపాజిట్‌ను రెట్టింపు చేసింది. రెండు దశాబ్దాలుగా 10 వేల డాలర్లుగా ఉన్న డిపాజిట్‌ మొత్తాన్ని ఏకంగా 20,635 డాలర్లకు పెంచుతున్నట్లు కెనడా ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ ప్రకటించారు. ఈ నిబంధన వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు ఆయన వివరించారు

Facebook
WhatsApp
Twitter
Telegram