E-PAPER

ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు.. తాజాగా శుక్రవారం గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).

 

జనవరి 1 నుంచి జనవరి 21 వరకు గ్రూప్ 1 పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. మార్చి 17న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-1 నోటిపికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.

 

గ్రూప్-81 పోస్టుల్లో ఏపీ సివిల్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18, డీఎస్పీ సివిల్ 26, రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ 6, కో-ఆపరేటివ్ సర్వీసెస్‌లో రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆపీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

 

ఇప్పటికే గ్రూప్-2 నోటిఫకేషన్ విడుదల

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను గురువారం (డిసెంబర్ 7) ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 897 గ్రూప్ -2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331 ఉండగా, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 వరకు ఉన్నాయి.

 

ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం అవుతాయి. 2024 జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రూప్‌ 2 సిలబస్‌ ప్రకటించిన కమిషన్‌ తాజాగా పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram