గురువారం సాయంత్రం అసెంబ్లీ సమావేశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, అర్ధరాత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బాత్‌రూంలో జారిపడ్డారు. వాష్‌రూంకు వెళ్లిన ఆయన అదుపు తప్పి జారి పడడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పరీక్షలు చేసిన వైద్యులు పాదం వద్ద ఫ్యాక్చర్ అయినట్లు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు