కల్యాణ్ రామ్ హీరోగా నటించిన’డెవిల్’ సినిమా తాజాగా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్‌ను కొంతసేపటి క్రితం వదిలారు. ఇది తన కెరియర్‌లోనే ప్రత్యేకమైన సినిమా అవుతుందని కల్యాణ్ రామ్ చెబుతున్నాడు. ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.